19, మార్చి 2013, మంగళవారం

జన హ్రుదయ ఘోష ! హోసన్నా!!

స్వాగతం

"ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక!" మార్కు సువార్త 11:9
యేసు యెరూషలేము లోనికి విజయోత్సవంతో ప్రవేశించిన సంఘటన చరిత్రలో ఒక అరుదైన
ఘట్టం. పండుగకు వచ్చిన వేలాది మంది ప్రజల జయ జయ ధ్వానాల మధ్య ఆయన పట్టణం
లోనికి ప్రవేశించాడు. నిజానికీ సంఘటన ప్రజలు ముందుగా వూహించింది కాదు.
యేసును స్వాగతించేందుకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు జరగలేదు. అంతా
అప్పటికప్పుదు స్వచ్చందంగా జరిగిపోయింది. "హోసన్నా" అనే నినాదాన్ని మొదటిగా
 ఎవరు అందుకున్నారో గాని, ఆ మాట ఆయనకు ముందు వెనుకల నున్న ప్రజల హ్రుదయాలలో
 ప్రతిధ్వనించి పట్టణమంతా మారుమ్రోగింది. ఏసుకు స్వాగతం పలికిన ప్రజలు
బహుశా దేవాలయం వరకూ ఆయన్ని వెంబడించి ఆ తర్వాత ఎవరి విడిదికి వారు
వెళ్ళిపోయి వుంటారు.
కాని యెరూషలేము లోనికి యేసును మౌనంగా స్వాగతించినవి మరి కొన్ని వున్నాయి.
అవి శ్రమ, మరణం, సమాధి. అవి అజ్ఞాతంగా వుండి చాలా అత్రుతతో ఏసుకు స్వాగతం
పలికాయి. ప్రభువు వాటి గురించి ముందుగానే చెప్పాడు. ఫిలిప్పుదైన కైసరయ
మార్గంలో నడుస్తూ తన కోసం హింస, మరణం యెరూషలేములో పొంచి వున్నాయని చాలా
స్పస్టంగా చెప్పాడు. దారి పొడుగునా ఆయన తమతో చెపుతూ వచ్చిన మాటలకు, ఆ రోజు
యెరూషలేములో తమకు ఎదురైన అనుభవానికి మధ్య పొంతన లెకపోవటాన్ని శిష్యులు
గమనించారో లేదో తెలియదు గాని, తన చుట్టూ చేరిన ప్రజలు వేస్తున్న కేకల వెనుక
 దాగి వున్న మరణ మ్రుదంగపు యేసుకు వినిపిస్తూనే వుంది.
ఇక్కడ చిత్రమేమంటే, శ్రమ, హింస, మరణాలు మూకుమ్మడిగా తాము యేసుకు స్వాగతం
పలికామని సంబరపడ్డాయి గాని, నిజానికి యేసు తనకు తానుగా స్వచ్చందంగా వాటిని
స్వాగతించాడు. ఆయన ధైర్యంగా వాటి దుస్ట కౌగిలిలోకి నడిచి వెళ్ళాడు.
ఎందుకంటే "హోసన్నా" అంటూ ప్రజలు చేస్తున్న జయజయధ్వానాల నడుమ వుక్కిరి
బిక్కిరై కడకు సమసి పోయేవి శ్రమ, మరణాలే నని ఆయనకు తెలుసు.
"ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమెక్కడ"? అంటూ భక్తుడైన పౌలు చేసిన
 పరిహాస నినాదపు పునాదులు "హోసన్నా" అంటూ ప్రజలు వేసిన ఈ కేకలలోంచే
ఏర్పడ్డాయి.
అవును. హోసన్నా ఒక సామూహిక విజయ ధ్వని, అది జన హ్రుదయ ఘోష! 
మీ అభిప్రాయాలను ఈ  ఈమెయిల్ ద్వారా మాకు తెలుపండి
reformation2017india@gmail.com
మా ఫోన్ నంబర్ 9491699674
        

10, నవంబర్ 2012, శనివారం

రిఫర్మేషన్ 2017 ఇండియా 

 ఒక విశ్వాస పునరంకిత ఉద్యమం. 2017 లో జరిగే దిద్దుబాటు పండుగ పంచ శతాబ్ది సంబరాలను సమైక్యంగా జరుపుకొనెందుకు తెలుగునాట గల అన్ని ప్రొటెస్టెంట్ సంఘాలను సంసిద్ధం చేసేందుకు సువార్త జ్వాల దేన్ని ప్రారంభించింది. 2017 లో ఈ పండుగను ఒక లక్ష మంది విశ్వాసులతో దేవుని నామ మహిమర్ధం జరుపుకోవాలన్నది మా లక్ష్యం. ఈ ఐదేళ్ళలో 500 ల సంఘాలను దర్శించి ఈ పండుగ ప్రాశస్థ్యతను తెలియ చెప్పేందుకు అనేక ప్రాంతాలను దర్శిస్తున్నాం. 

గుంటూరులో  లక్ష మంది విశ్వాసులతో జరుపనైయున్న ఈ వుత్సవంలో 500 కిలోల కేక్ ను కట్ చెయ్యాలని ఆశిస్థున్నాం. ఆలాగే 500 మీటర్ల బానర్ను ప్రదర్శించాలనుకుంటున్నాము. ఇంకా 500 కిలో మీటర్ల శిలువ యాత్రను చేపట్టెందుకు సంసిద్దులమౌతున్నాం. అలాగే రిఫర్మేషన్ స్ఫూర్తితో ఐదు వేల బైబిల్సును క్రైస్తవేతరులకు అందించేదుకు ప్రణాళికను కలిగున్నాం

ఈ బ్రుహత్తర కార్యంలో మీ వంతు సహకారాన్ని ప్రార్ధనా పుర్వకంగా అందిస్తారని ఆశిస్తున్నాము. 

మీ రవి ప్రసాద్